శ్రీ లంకమ్మ ఆలయం:
దివిసీమలోనేకాక, కృష్ణా జిల్లాలో ప్రసిద్దమైన గ్రామదేవత శ్రీ లంకమ్మ తల్లి. లంకమ్మ శబ్దం ద్వారా నీటి మధ్యన దీవులలో ఉండే ప్రజలను అనుగ్రహదృష్టితో చూచే చల్లనితల్లి లంకమ్మ అని తెలుస్తుంది. కోనసీమలో కొన్ని లంక గ్రామాలల్లో లంకమ్మతల్లి జాతరలు , కొలుపులు మహోకోలహలంగా జరుగుతాయి. మరల దివిసీమలో లంకమ్మ తల్లి అటువంటి వైభవాన్ని భక్తులచే అన్డుకొంటుంది. అమ్మవారిని దర్శిస్తే చాలు! పూజిస్తే చాలు! మొక్కుకుంటే చాలు! సిరివెన్నెల దరహాసాలను చిందిస్తూ మన కోరికలను నెరవేరుస్తుంది. చైత్రపూర్ణిమ నాడు అమ్మవారికి మహత్తరమైన జాతర జరుగుతుంది. కృష్ణా జిల్లా నలువైపులనుండి భక్తజనావళి అమ్మవారి నామాన్ని స్మరిస్తూ భక్తిగీతాలను ఆలపిస్తూ, భజనలు చేసుకుంటూ, మహిమలను భక్తిపారవశ్యంతో తలచుకుంటూ ఆలయానికి వస్తారు. ఆలయం ప్రక్కనే పోతురాజ వృక్షం కూడా ఉంది. అమ్మవారికి కుంకుమపూజలు, ఊయలఊపుసేవ, మొదలగునవి జరుగుతాయి. రజకులు అమ్మవారి అర్చకులు. సంప్రదాయ బద్దంగా అర్చనలు జరుగుతాయి.
ఈ ఆలయాన్ని సుందరంగా పునఃనిర్మించి తర్వాత ప్రతిష్టా కార్యక్రమాలు 07-041983లో వైభవంగా జరిగాయి. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ, సుఖవేణమ్మదంపతులు ప్రతిష్టా కార్యక్రమాని నిర్వహించారు. చింతపూడి రాఘవయ్య గారు శిఖర ప్రతిష్ట చేశారు. ఆ తర్వాత భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. 1610-1989 అమ్మవారికి కావలసిన ఆభరణాలు చేయించారు. 13-10-1996 ఈ ఆలయ స్థలదాతలు శ్రీ కాండ్రేగుల శ్రీనివాస జగన్నాథ పంతులు బహాదూర్ గారు. స్ఫూర్తి శిష్టా పిచ్చయ్య గారు ( జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంట్ ) మిత్రులు గుడిసేవ విష్ణుప్రసాద్ గారు “ తల్లీలంకమ్మ!” అనే పేరుతో చక్కని భక్తి గీతాల పుస్తకం ప్రచురించారు. ఈ ఆలయం దినదిన ప్రవర్థమానమై ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి పొందాలని ఆదిశగా అందరూ కృషి చేయాలని అమ్మవారి భక్తుల ఆకాంక్ష.