కళ్ళేపల్లి ప్రస్తావన :
పౌరాణిక ప్రసిద్దిపొందిన శైవ క్షేత్రాలలో పెదకళ్ళే పల్లి – దుర్గా నాగేశ్వర క్షేత్రం ఒకటి. దక్షిణ కాశీ ప్రశస్తి ఆంధ్రదేసమంతటా పరివ్యాప్తమైనది. తీర్థము – క్షేత్రము, రెండు కలసి తీర్ధక్షేత్రంగా విరాజిల్లుచున్న గ్రామం పెదకళ్ళేపల్లి. శతాబ్దాల చారిత్రిక సత్యాన్ని పదిలంగా నిలుపుకొన్న భూమి ఇది. సంగీత, సాహిత్య కలారంగాలకు పుట్టినిల్లు. కాళలకు కల్పవల్లి ఈ పెదకళ్ళేపల్లి.
పెదకళ్ళేపల్లి – పేర్లు :
పురాణాలలో – క్షేత్ర మహత్మ్య గ్రంధాలలో కదళీవనము, రంభాపురము, అని పేర్లు. శాసనాలలో కదలుపల్లి, కదలిపురం, కదల్పల్లి, కల్లేపల్లి అని పేర్లు. కదలుపల్లి – కల్లేపల్లి అయింది. కడలు శబ్దానికి సముద్రము అని అర్ధం. బహుశా గ్రామానికి దగ్గరగా సముద్రం ఉన్నదేమో! అందువల్ల కదలుపల్లి అనే పేరు వచ్చి ఉంటుంది. తర్వాతి కాలంలో చినకళ్ళేపల్లి ఏర్పడడం వల్ల, ఇప్పుడు ఆలయాలున్న కల్లేపల్లికి పెదకల్లేపల్లి అనే పేరు వచ్చింది.
పురాణ ప్రాశస్త్యం :
పెదకళ్ళేపల్లి క్షేత్రవైభవం స్కామ్దపురాణాలలోవిపులంగా చెప్పబడింది. ఇది తొలుత నాగాక్షేత్రము. తర్వాత ఋషిక్షేత్రము. పిమ్మట సత్యక్షేత్రము. శ్రీ మత్కదళీపుర మహత్మ్య గ్రంధంలో ఈ క్షేత్రం గురించి విస్తారంగా వర్ణింపబడింది. అనేక కతాలతలు ఈ క్షేత్ర వృక్షం చుట్టూ అల్లిబిల్లిగా అల్లుకోనిపోయాయి. మూల స్పర్శ కంటే ఉత్తర వికాసం సంస్మరణీయం. రమణీయం. కొన్ని ప్రధాన అంశాల ద్వారా కళ్ళేపల్లి పురాణ వైభవం మనకు తెలుస్తుంది. నాగమాత కద్రువ శాపం వల్ల, జనమేజయుని సర్పయాగంలో మంత్ర స్వాహాకారశక్తి వల్ల పాములు యజ్ఞకుండంలోపడి నశిస్తాయన్న విషయం మరపుకు రాక అనంత, వాసుకి, తక్షక, కర్కోటక అనే పేర్లుగల ఉన్నత సర్పాలన్నీ ఉత్తర వాహినిగా ప్రవహించే క్రుష్ణానదీతీరంలో, కదళీవనంలో పరమేశ్వరుని గూర్చి తీవ్రమైన తపస్సు సారి, ఆయన అన్గ్రహం సంపాదించాలని, మరణభయాన్ని బాపుకొని, నిష్కల్మష హృదయంతో ఇక్కడ నాగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించి ధన్యులవడం వల్ల దీనికి నాగేశ్వర క్షేత్రమనే పేరు వచ్చింది.
ఇంకొక కథనం ఏమంటే జనమేజయ మహారాజు ఈ ప్రాంతంలోనే సర్పయాగం చేయసాగాడు. ఈ యాగానికి పూర్వమే అనంత, వాసుకి, తక్షక, కర్కోతకాదులు మహేశ్వరుని వరప్రసాదం వల్ల రక్షితులై ఉన్నారు. తర్వాత ఆస్తీకులు అనే మహర్షి వచ్చి సర్పయాగాన్ని ఆపుచేయించాడు. జనమేజయుడు సర్పయాగం ఆపిన కారణంగా వచ్చే యజ్ఞ దోషాన్ని ఆస్తీకుడు పోగొట్టాడు. పిమ్మట జనమజేయుని కో రిక మీద జనమేజయ క్షేత్రంగా ఈ ప్రాంతం పిలవబడుతుందని వరమిచ్చాడు. ఇందువల్ల పెదకళ్ళేపల్లికి జనమేజయ క్షేత్రమనే పేరు వచ్చింది.
ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకా అనేక పురాణకథలు ఉన్నాయి. కదళీ వృక్షాలు అధికంగా ఉన్న ప్రాంతం కనుక, దీనికి కదళీవనం అనే పేరు వచ్చింది. భారతదేశంలో 18 అరణ్యాలున్నాయి. అందులో చివరిది కదళీవనం – కళ్ళేపల్లి. నాగేశ్వర స్వామిని అర్చించడానికి నాగాకుమారులు నాగేశ్వర లింగానికి అటు ఇటు కదళీస్తంభాలు నిలిపారు. స్వామివారికి సేవా నిమితం కదళీ (అరటి) వృక్షాలు అవసరం కనుక, ఆ వృక్షాలు అధికంగా పెంచి పోషించడం వలన కదళీవనం అనే పేరొచ్చిందని మరోక కథనం. ఈ కదళీ క్షేత్రానికి తూర్పున కృష్ణానది, దక్షిణాన అయోధ్య , పశ్చిమాన టేకుపల్లి, ఉత్తరాన కదళీవనం సరిహద్దులు. ఇక్కడ వశిష్టాది మహర్షులు కొంతకాలం తపస్సు చేసుకోవడం జరిగింది.
నాగాకుండం :
దేవాలయానికి వెలుపలగా ఉన్న చెరువుకు నాగకుండమని, నాగహ్రదమని,నాగ సరోవరమని పేర్లు. ఉత్తమ నాగేశ్వర ఆలయం:దళాన్ని దీనిలో సంగమించి ఉండడం వల్ల పరికర్ణికా తీర్ధమనే పేరు విశేషంగా దీనికి వచ్చింది. ఈ నాగాకుండం యొక్క అష్టదిక్కులకు అస్తనామాలు ఉన్నాయి. ఈ 8 తీర్ధ ఘట్టాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. కృష్ణానదీ స్నాన పాపాల వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుందో, ఈ స్నాన పానాల వల్ల కూడా అంతే పుణ్యం వస్తుంది. ఈ నాగాకు౦డానికి ఎనిమిది దిక్కులా ఉన్న స్నానఘట్టాల కున్న పేర్లన్నీ సర్ప సంబందితములే! ఇవిగాక శరదాకుండమని, నలకూబరకుండమని, విష్ణుకుండమని, సూర్యకుండమని అనేక దేవతల పేర్లతో కుందాలున్నాయి. ఈ పేర్లు అన్నీ ప్రధానమైన నాగాకుండానికే గాక, కళ్ళేపల్లి గ్రామంలో ఉన్న వివిధ కుండాలకు వర్తిస్తుంది. కరకట్టలు పోయక పూర్వం కృష్ణానదీ వరదల వల్ల గ్రామంలో అనేక కుండాలు ఏర్పడి ఉండవచ్చు. ఆ నీటికున్న శక్తి చేత, పవిత్రత కోసం ఈ పేర్లు వచ్చి ఉండవచ్చు. ఇప్పటికైనా ఈ కుండాలు గుర్తించి ఉంటే, వాటిని సంరక్షించు కోవడం మన బాధ్యత.
గోముఖాకారంలో ఉన్న చెరువు నేడు నిస్తేజంగా ఉంది. (కడుపా కళ్ళేపల్లి చెరువా!) జన్మభూమి మొదలగు పథకాల ద్వారా దీనిని బాగుచేసి భక్తుల స్నానానికి దానిని యోగ్యంగా చేయాలి. 8 దిశలయందు స్నానఘట్టాలు ఏర్పాటుచేసి, వాటికి పేర్లున్న బోర్డులు పెట్టాలి. ఒక పవిత్ర యాత్రాస్థలంగా దీనిని రూపొందించవచ్చు. దీని వల్ల పర్యాటకులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుoది. ప్రతి సంవత్సరం పర్యాటక దినోత్సవం ఏర్పాటుచేసి, చక్కని బ్రోచర్లు ప్రిన్తుచేసి అన్ని ఆలయాలకు, పర్యాటక కేంద్రాలకు పంపే ఏర్పాటు చేయాలి. మన అభివృద్ధి మన కృషి మీదే ఆధారపడి ఉంటుంది. గ్రామస్థులు, ఆలయ అధికారులు సంయుక్తంగా పనిచేస్తే చక్కని ఫలితాలు వస్తాయి.
ఆలయ పుట్టుపూర్వోత్తరాలు :
పౌరాణిక ప్రసిద్ధిని పొందిన పెదకళ్ళేపల్లి అనేక చారిత్రిక విశేషాలను తెలియజేస్తుంది. ఏనాటిదో! ఎవరు నిర్మించారో! తెలియదు గాని, కాకతీయుల పరిపాలనా కాలంనాటికి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఇటువంటి స్టితిలో ఆలయాన్ని పునర్నిర్మాణము చేసిన మహనీయుడు సోమశివాచార్యులు. పుష్పగిరి మట సాంత్తానికులుగా వ్యవహరిస్తూ సిద్దసంకల్ప శక్తి కలిగినవారు. కాకతీయరాజ్యాన్ని కుమారరుద్ర దేవమహారాజులు పరిపాలిస్తున్న కాలమది. సోమశివాచార్యులు వారు భక్తుల శ్రేయస్సుకై, గ్రామాభివృద్ది కోసం కదలుపురి నాగేశ్వర మహాదేవరకు క్రీ.శ. 1292 సంవత్సరంలో రాతి గుడి కట్టించారు.
నాగేశ్వర ఆలయం :
విశాలమైన ప్రాంగణంలో చారిత్రకసంపదతో ఆధ్యాత్మిక వాతావరణంలో అశేష భక్తజనావళి విశేషంగా ఆకర్షిస్తున్న దివ్య దైవ ప్రభా విలసితం నాగేశ్వరస్వామి ఆలయం. గంభీరమైన రాజగోపురం ముందు చల్లపల్లి రాజావారి శాసనం ఉంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణ మార్గమునందు సత్యస్థంభం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది పాలరాతి స్థంభం. బౌద్ధ చిహ్నితములతో అస్పష్టంగా కనిపించే బ్రాహ్మీశాసన లిపితో ఉన్న స్థంభం చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. అయితే ఈ బ్రాహ్మిశాసనం చదివే వీలులేక పోవడం ఎంతో విలువైన సమాచారం మనకు అందకుండా పోయింది. వాదవివాదాలు ఏర్పడినప్పుడు ఈ స్థంభం దగ్గర సత్యప్రమాణం చేయడానికి వస్తారు. ఆసత్యవాడదికి దైవశిక్ష పడుతుంది. అందువల్ల ఆ స్తంభానికి సత్యస్తంభమనే పేరు వచ్చింది. కర్కోటక నాగ ప్రతిమ ఇక్కడే ఉన్నది. కాబట్టి కర్క్కోటక స్తంభామనే మరోక పేరు కూడా ఉంది. ఆలయ గోడలపై ఆలయాన్ని ప్రథమంగా పునర్నిర్మించిన సోమశివాచార్యుల వారి ప్రతిమ మనకు కనిపిస్తుంది. ప్రక్కనే పంచముఖ గణపతి విగ్రహం కూడా కనిపిస్తుంది. వాయువ్య దిశలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, ఉత్తదిశగా దక్షణాభిముఖంగా కాలభైరవ ఆలయం ఉంది. ఈశాన్య దిశలో 16 స్తంభాల కళ్యాణమండపం ఉంది. ఇక్కడ స్తంభాల మీద శాసనాలు చెక్కి ఉన్నాయి.
రంగమండప నిర్మాణంలో బౌద్ద చిహ్నిత స్తంభాలు కొన్ని కనిపిస్తున్నాయి. ముఖమండపం, ప్రవేశ ద్వారపాలకులతో ద్వారస్తంభం పైన గజలక్ష్మి అమ్మవారితో ఉన్నది. ఈ మండపం మధ్య నాలుగు స్తంభాలు, మధ్యలో నంది. ముఖమండపంలో శాసనాలతో పాటు మహా తపస్వీ, మంత్రవేత్త ఉమ్మన్న గారి రూపు ఒక స్థంభం మీద చెక్కబడింది.
మరోక స్తంభం మీద మరోక యంత్రం, ఇంకొక స్థంభం, మరోక యంత్రం, చెక్కబడింది. వీటి విశ్లేషణ పూర్తి కానందువలన వివరాలు అందించలేకపోతున్నాను.
అంతరాలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, పైన దక్షిణం వైపు గణపతి ఉన్నారు. గర్భాలయ ప్రవేశద్వారంపై దత్తాత్రేయుని విగ్రహo ఉంది. పైన ఉత్తరదిశగా చిన్న బొమ్మ ఉంది. రూపు తెలియడం లేదు.
గర్భాలయంలో పరమ కారుణ్యమూర్తి, సమస్త దోష నివారకుడు, సకలిస్వర్య ప్రదాయకుడు శ్రీ నాగేశ్వరస్వామి ఉన్నాడు. దివ్య ప్రకాశంతో, అజ్ఞానతమస్సులను పారద్రోలి జ్ఞానజ్యోతులను హృదయక్షేత్రాలతో వెలిగిస్తాడు. పదేపదే స్వామిని దర్శించవలెనన్న భక్త్యావేశం భక్తులకు కల్గుతుంది. భక్తసులభుడు –సర్వశక్తి ప్రదాయకుడు అయిన నాగేశ్వరస్వామి వారిని నమశ్శతములు భక్తులు సమర్పిస్తుంటారు. మొక్కుబడులు చెల్లిస్తుంటారు. పునర్ధర్శనం కోరుకుంటారు.
దుర్గాలయం :
దుర్గా అమ్మవారు శక్తివంతముగా, చైతన్య చ్చాకిచ్చాకితముగా, ఇచ్చజ్ఞాన క్రియాశాక్తుల సంమేలనముగా, అభయ ప్రధానిగా, ఆశ్రిత భక్తజన కల్పవల్లిగా ప్రఖ్యాతి కెక్కినది. అమ్మవారి ముఖమండప స్తంభాలపై చిత్రవిచిత్ర కథాఘట్టాలను తెలియచేసే శిల్పాలు ఉన్నాయి.
మొత్తం మీద దుర్గానాగేశ్వర స్వామి ఆలయాలలో మనకు అర్ధం కాని శిల్పాలు, సంకేతాలు, విషయాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
అమ్మవారి సన్నిధియండు ఏకపాదం మీద నిలబడి 6 రోజులపాటు దుర్గమ్మను స్తోత్రం చేశారు. అంకినీడు ప్రభువులు (1792-1819) వారు శివగంగలో ఆలయం ఒకటి కట్టించి తన ఇష్టదైవమైన ‘మహీషాసురమర్దినీ’ అమ్మవారిని ప్రతిష్టించారు.
ఉత్సవాలు :
దుర్గా నాగేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య నైమిత్తిక అర్చనా కైoకర్యాలతో పాటు ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి. ఉగాది పర్వదినం, ఇత పర్వదినాలు , ఆశ్వీయుజ మాసంలో అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు, కార్తిక మాసంలో అఖండ దీపారాధనలు, ఆకాశ దీపోత్సవాలు, శివరాత్రి జాతరలు,కళ్యాణ ఉత్సవాలు వేలాది భక్తుల సందడితో భూలోక కైలాసంగా జరుగుతాయి.
మాఘమాసంలో దశమి రోజున అంకురార్పణ, ఏకాదశి రోజున ధ్వజారోహణం, త్రయోదశి కళ్యాణ స్నానం, చతుర్దశి రోజున జగజ్జ్యతి కళ్యాణ ఉత్సవం, అమావాస్య రోజున రథోత్సవం జరుగుతుంది. ఈ రథం ముందర చల్లపల్లి ప్రభువులు పాదచారులై నడవడం అనుస్యూతంగా వస్తున్నా సదాచారం. త్రిశూల తీర్ధం రోజున బంగారుపల్లకిలో స్వామివారిని వెంచేపుచేసి, ఏనుగు అంబారీ మీద అధిరోహింప చేస్తారు. చల్లపల్లి రాజావారు తాము స్వయంగా గజచోదకులై ఉత్సవాన్ని నడిపిస్తారు. కన్నుల పండుగగా ఈ ఉత్సవం సాగుతుంది.అసంఖ్యాకంగా భక్తజనులు ఈ ఉత్సవం చూడడానికి వస్తారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాటు చేస్తారు.