చారిత్రిక వైభవం:
ఆంధ్రదేశంలో ప్రసిద్దమైన ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రాలలో ఘన్సాల ఒకటి. ఇది బౌద్ధక్షేత్రమే కాకుండా, ప్రఖ్యాతి పొందిన రేవు పట్టణం కూడా! దీని కీర్తి దేశవిదేశాలలో విఖ్యాతము. ఇక్కడ దొరికిన బౌద్ధ స్థూప శిధిలావశేషాలు, వివిధ కాలాల నాటి నాణాలు, గృహోపకరణాలు, శిల్పాలు, తదితర అంశాల వల్ల దివిసీమలో ఘంసాల – దివిసీమ చరిత్రను పరిపుష్టముచేయడమే గాక! ప్రాశస్త్యాన్ని కూడా కలగచేసింది. ఘంటసాల వ్యాపార కేంద్రము కావడం వలన వ్యాపారులు, నావికులు, ఓడలకు సంబంధించిన కార్మికవర్గం, ఉద్యోగులు, తదితర వర్గాలవారందరూ ఘంటసాలలో నివశించేవారు. వివాద వర్గాలకు సంబంధిoచిన పురాతన వస్తువులు ఈ అంశాన్ని బలపరుస్తున్నాయి. ఇక్కడ సముద్ర ఘంటసలలోని సమస్త ప్రజలు జలదీస్వరుడిని ఆరాధించేవారు. జలధి అంటే సముద్రము గదా! ఎన్ని మాతాలు – ఎన్ని సిద్దాంతాలు వస్తున్నా ప్రాకృతిక శక్తుల ఆరాధనలో పెద్దగా మార్పులుండవు. బౌద్ధమతం ప్రచారంలో ఉన్నా! గ్రీకు దేశ భౌగోళికశాస్త్రవేత్త అయిన టాలమి (క్రీ.శ.140 ) భారతదేశంలో రేవులను పేర్కొంటూ, కృష్ణానదీ ముఖద్వారంలోని కొంతకోశ్శిల ఘంటసాలగా నిర్ధారించారు.
ఇక ఇక్కడ దొరికిన మన నానాలమీద రెండుతెర చాపలు గల ఓడ చిహ్నము, ముందు అర్ధచంద్రాకృతి కలిగిన తెరచాపలతో ఉన్న ఓడచిహ్నము, విభిన్నమైన తెరచాపలతో కూడుకున్న ఓడ చిహ్నముల వల్ల మన నౌకావ్యాపారము అభివృద్ధి ఎంత ఉన్నతంగా ప్రశాక్తికేక్కినదో తెలుస్తుంది. ఇక విదేశీనాణాలు వేలాదిగా దొరికాయి. ఘంటసాలలో విదేశీ వర్తకులు కూడా నివశించేవారు. ఆనాడు ఘంటసాల ఒక విధంగా మెట్రోపాలిటన్ సిటీ అన్నమాట! విదేశాలతో క్రయవిక్రయాలు జరిపే రేవు పేరుకు చివర ‘పట్టణం’ అనే పదం వస్తుంది కాబట్టి –ఘంసాల పట్టణ స్థాయి కలదని మనం అనుకోవచ్చు.
‘ఘంటసాల’ పేరు మీద చాల చర్చ జరిగింది. శాసనాలలో ఉన్న కంటకసేల – ఘంటసాల అయిoదని పరిశోధకుల అభిప్రాయం. శాసనాలలో కటకశాల, కంటకశాల, గంట్టశాల అనే పేర్లు వస్తున్నాయి. గ్రామానికి అనుబంధంగా ఉండే ఘోటకము లేదా గోటకము ఈ ప్రాంతీయ చరిత్ర వేరు. ఘంటసాలకు చోదపాoడ్యమని, గజరాజ పట్టనమనే పేర్లు కూడా ఉన్నాయి.
జలదీశ్వరస్వామి ఆలయం :
పౌరాణికంగా చూసినట్లయితే ఈ జలదీస్వరలింగాన్ని అగస్త్య్స మహర్షి ప్రతిష్టించినట్లుగా తెలుస్తుంది. అగస్త్యునికి-సముద్రానికి అవినాభావ సంబంధము ఉందికదా! ఇక జలధి అనగా సముద్రము. సముద్ర వ్యాపారం యొక్క ఆతుపోటులన్నీ, లాభనష్టాలన్ని సముద్రం మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ సముద్రానికి సంకేతంగా ఈశ్వరుడిని,జలదీశ్వరుడు అనే పేరుతో సంభావించుకొని ఆ స్వామికి ఆలయం కట్టి ముఖ్యంగా రాజులు, వ్యాపారాలు అర్చిస్తూ ఉండేవారు.క్రమక్రమంగా జలదీశ్వర స్వామి విఖ్యతిని పొందడం జరిగింది భక్తుల వలన. చిత్రమేమంటే నదుల రేవుల దగ్గర, సముద్రరేవు పట్టణాల దగ్గర ఈశ్వరుని పేరుతో శివాలయాలే ఉంటాయి అధికంగా. శివుడు కాకపోతే అతని పరివారములోని వారు ఆలయాలలో కొలువై ఉంటారు. పులికాట్ నుంచి చిలక సరస్సు దాకా కుడా! అప్పుడప్పుడు శక్తికి, విష్ణువుకు కొద్దిగా చోటు ఉంటుంది. ఈ గ్రామం మధ్యలో ఉన్న పెన్నేరమ్మ దేవత కుడా జలదేవతే!
పంచభూతాలలో జలము ఒకటి. జాలానికి ప్రతీకగా జలదీశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ జలదీస్వరాలయం విశిష్టత ఏమంటే, పావనపట్టం పై స్వామీ వారు అమ్మవారు కలిసే ఉంటారు. శివలింగము వేరు,అమ్మవారు వేరుగా ఉంటారు.ఇక్కడ మాత్రం సంయుక్తంగా కనిపిస్తారు. ఇక్కడున్న సుభ్రమంన్యేశ్వర స్వామిని 1813వ సంవత్సరంలో గొర్రెపాటి కృష్ణమ్మ గారు నిర్మించారు. మార్గశిర శుద్ధ షష్టికి ఉత్సవం భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. క్రుష్ణమ్మగారు జలదీశ్వరాలయానికి సున్నం కొట్టించి, ప్రహరీ కట్టించి, కళ్యాణమండపాన్ని, ఆలయంలో యజ్ఞశాల నిర్మించారు. స్వామికి మిద్దెరథం చేయించారు. ఈ రథం మీద రామరావణయుద్ధం, భారత యుద్ధం చిత్రింపబడి ఉండేవి. 1864వ సంవత్సర ఉప్పెనలో ఈ రథం కొట్టుకుపోయింది.తర్వాత బాలకృష్ణమ్మ గారు ఉప్పెనకు యజ్ఞశాలకు పోతే మరల కట్టించారు. స్వామీ పవళింపు సేవ కోసం ఒక భవనం కట్టించారు.
కాగా ఆలయ విమాన శిఖరం దివిసీమ ఆలయ విమాన శిఖరాల కంటే భిన్నముగా కనిపిస్తుంది. గాలిగోపురం యొక్క వాస్తు లక్షణంతో ఉంటుంది. 3 శిఖరాలు ఉంటాయి. దీనిని గజపృష్టాకార విమానమని అంటారు. ఇటువంటిదే చేజెర్లలోని కపోతేశ్వర స్వామీ ఆలయం విమానం కుడా! ఈ సారుప్యత తంజావూరు బృహదీశ్వరాలయంలో చూడవచ్చు. బహుశా చోదపాండ్యాపురం అనే పేరు ఘంటశాలకు వచ్చిన సందర్బంలోనే విమానం నిర్మించి ఉండవచ్చు. మాఘశుద్ద పూర్ణిమ రోజున స్వామివారికీ కళ్యాణమహోత్సవం జరుగుతుంది.
ఇతఃపూర్వము జలదీశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో ఉగ్రనరసింహ ఆలయం ఉండేది. అది సముద్రంలో మునిగిపోయిందని చారిత్రిక పరిశోధకులు భావిస్తున్నారు. ఘంటసాల గ్రామానికి పడమరగా ఉన్న వైష్ణవ చెరువు దగ్గరగా చెన్నకేశవ స్వామి ఆలయం, విష్ణాలయం ఉండేవని పెద్దలు చెబుతున్నారు. కాని ఆధారాలు లభించడం లేదు.శాసనాల ద్వారా భోగేస్వరాలయం, విశ్వేశ్వరాలయం, ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అనేక ఆలయాలు, దేవతలు ఉండేవారు. మొత్తం దివిసీమలోనే ఆలయ బాహుళ్యం గల పట్టణం ఒకనాటి ఘంటసాల. లభ్యమైన శిధిలాల వల్ల మనకీ విషయం స్పష్టమవుతుంది.
ఇక్కడ ఉన్న శిల్పాలలో నరసింహ, కాలరభైరవ, సరస్వతీదేవి, రతీదేవి విగ్రహాలు చాలా ప్రసిద్దిపొంది ఉన్నాయి. పాలరాతి మీద ఇవి మలచబడ్డాయి. నరసింహస్వామి శిల్పం తప్ప మిగతావి క్రీ.పూ. మొహంజోదారో శిల్పిరీతిని పోలిఉన్నాయి. నారసింహ శిల్పం మాత్రం చోళ, కాకతీయ శిల్ప సంబంధిగా కనిపిస్తుందని, కాదు విజయనగర కాలం నాటిదేనని చారిత్రిక పరిశోధకులు భావిస్తున్నారు.
శాసనవిశేషాలు :
బౌద్ధక్షేత్రంగా ఘంటసాల ప్రశస్తిని తెలిపే శాసనాలు ఉన్నాయి. అయితే వాటిని గూర్చి మాత్రమె కొద్దిపాటిగా తెలియజేస్తున్నాము. క్రీ.శ.9వ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు, ఇక్కడ 2 వేల మంది బ్రాహ్మణులకు గృహదానం చేసినట్లుగా అతను వేయించిన శాసనం వల్ల తెలుస్తుంది. కొన్ని వందల మంది దెవదాసీ స్వామిని ఆరాధించినట్లు, వైశ్యులనేకులు స్వామివారికి దానాలు చేసినట్లు తెలియవస్తుంది. కులోత్తుంగ చోదదేవుడు తన తల్లి దండ్రులకు (ప్రీత్యర్ధమో? స్మ్యత్యర్ధమో? స్పష్టంగా తెలియడం లేదు ) గాను జలదీశ్వర స్వామి వారికి కొంత భూమిని దానంచేశాడు. అనేకమంది స్వామివారిని ఆలయాన్ని పెంచిపోషించారు. అయితే రానురాను ఆ కట్టడాలన్నీ జీర్నమైపోయినాయి. ఇంతకుముందు ఘంటసాలకు చోదపాన్ద్యపురమనే పర్యాయనామం ఉందని చెప్పుకోవడం జరిగింది. ఇది చోడ-చాళుక్య యుగంలో వచ్చిన పేరు. ఆ కాలంలో కొన్ని ప్రసిద్ధ ప్రాంతాలకు పేరుల మార్పు జరిగాయి. విశాఖ పట్టణానికి కులోత్తుంగ చోడ పట్టణమని, బెజవాడకు రాజేంద్ర చోలపురమని, వేంగికి రాజచోదపురమని, సామర్లకోటకి రాజరాజ పాండ్య పురమని పర్యయనామాలు వచ్చాయి. ఇవి ఆనాటి రాజకీయ స్థితిగతులను తెలియచేస్తున్నాయి.
ఇందులోని మొదటి శాసనం రామలింగేశ్వర ఆలయంలోనిది. క్రీ.శ.1157 వ సంవత్సరం, ఇక రెండవ గుంటూరు జిల్లాలోని నూతక్కిగ్రామం –శక్తీశ్వర ఆలయం లోనిది. సంవత్సరంలేదు. ఇక మూడవ శాసనం ఘంటసాలలోనిదే! క్రీ.శ.1169 సంవత్సరం.
సుమారుగా ఇక్కడి ఆలయాలకు సంబంధించిన శాసనాలు14 దాకా లభిస్తున్నాయి. శాసనాలలో మొదటి శాసనాలు జలదీశ్వర స్వామివారికి సంబంధించినవి.తర్వాత శాసనాలు జలదీశ్వరునికి– విశ్వేశ్వర స్వామివారికి, భోగేశ్వర స్వామివారికి ( 1 శాసనం మాత్రమే ) సంబంధించినవి. వీటి ద్వారా ఆనాటి సాంఘిక స్థితిగతులు మనం తెలుసుకోవచ్చు.