అది 1977 వ సంవత్సరము నవంబరు 19 రాత్రి దివిసీమ కు మాత్రమూ కాళరాత్రి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం భీభత్స భయానకమై పెనుతుఫానుగా మారి దివిసీమ అతలాకుతలం చేసిన రాత్రి అది.
అటువంటి సమయంలో సముద్రము ఉప్పొంగి ఉప్పెనగా మారి చెలియలి కట్టి దాటి వికటాట్టహాసం చేస్తూ వెఇపదగలు విప్పి ఆగ్రహించిన ఆదిశేషుని వలె హంసలదీవి మీదకు సిరుచుకుపడింది. దీనికి ముందే కొంతమంది ప్రాణభయంతో గ్రామం విడిచి వెళ్ళిపోయారు. పరిస్థితులు విషమించడంతో సుమారు300 మంది ప్రజలు వేణుగోపాలస్వామి ఆలయంలో తలదాచుకున్నారు. తలపులు లోపల బిగించుకొని ఇసుక బస్తాలు, ఇతర సామాన్లు వాటికి అడ్డం పెట్టారు. సముద్ర తరంగం మృత్యువు రూపంలో తాళ ప్రయాణంలో ఉవ్వేతున ఆలయాన్ని ముంచెత్తింది. అందరూ ప్రాణభయంతో వేణుగోపాలస్వామిని అర్ధించారు. సముద్రం నీళ్ళు తలుపుల సందుల్లోంచి లోపలికి ప్రవేశించాయి. లోపలివాళ్ళు ప్రాణాల మీద ఆశావడులుకొన్నారు. అయితే స్వామివారి పాదాలను కడిగి సముద్రం నీళ్ళు మొత్తం వెళ్ళిపోయాయి. తనను శరణు జోచ్చినవారిని వేణుగోపాలస్వామి విడిచిపెట్టాడ కదా! మొత్తం మీద లోపలి జనం బ్రతికి బైతపడ్డారు. ఆ సంఘటనను గ్రామస్థులు నేటికీ కధలు కధలుగా విభిన్నరీతులలో చెప్పుకుంటారు.
ఉప్పెన వల్ల ఆలయ శిఖరం విరిగి పదిపోయింది. గోడల్లో బిగువు కొద్దిగా తగ్గింది.అక్కడక్కడ గుడి కొద్దిగా దెబ్బ తింది. తర్వాత దానిని బాగు చేసారు. ఏది ఏమైన ఆనాటి ప్రళయ భీకర దృశ్యానికి హంసలదీవి ఆలయం మౌన సాక్షిగా నేటికీ నిలిచి ఉంది. బ్రతికి బయటపడ్డ ప్రజలు స్వామిని ప్రతి సంవత్సరము ఆ రోజు దర్శించుకొని కృతజ్ఞతలు తెలియచేన్తుంటారు.
కాగా 1864వ సంవత్సరం లో వచ్చిన ఉప్పెన వల్ల ఈ ఆలయం ద్వంసం కాగా, నాటి ఉల్లిపాలెం కరణం అయిన కృష్ణరాయుడుగారు దీనిని పునరుద్ధరించారు.