Useful-info-for-public

1) ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ప్రభుత్వ సర్వీసులు ఆన్‌లైన్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో పాస్‌పోర్ట్ సేవలు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వచ్చేసాయి. పాస్‌పోర్ట్ ధరఖాస్తును సమర్పించేందుకు గంటల తరబడి క్యూలో నిల్చోవల్సిన అవసరం లేకుండా నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని సంబంధిత వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే చాలు, ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం…

స్టెప్ – 1:

ముందుగా పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

స్టెప్ – 2:

పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌ హోమ్ పేజీలోని Apply సెక్షన్‌లో కనిపించే రిజిష్టర్ (Register) లింక్ పై క్లిక్ చేయటం ద్వారా రిజిష్ట్రేషన్ ప్రకియను ప్రారంభించవచ్చు.

స్టెప్ – 3::

రిజిస్ట్ర్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.

టిప్ 4:

ఆ తరువాత పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

టిప్ 5:

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్‌ను పొందేందుకు “Pay and Schedule Appointment” అనే లింక్ పై క్లిక్ చేయండి.

టిప్ 6:

బుకింగ్ అపాయింట్‌మెంట్‌లకు ఆన్‌లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి మీ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబందించి ఆన్‌లైన్ చెల్లింపును క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేపట్టిండి.

టిప్ 7:

మీ దరఖాస్తుకు సంబంధించి ఆన్ లైన్ చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిన తరువాత “Print Application Receipt” లింక్ పై క్లిక్ చేయండి. మీరు పొందే ఈ రిసిప్ట్‌లో అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ పొందుపరచబడి ఉంటుంది.

టిప్ 8:

పొందిన అప్లికేషన్ రిసిప్ట్‌తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్‌లను తీసుకుని అపాయింట్‌మెంట్ బుక్ కాబడిన సమాయానికి సంబంధింత పాస్‌పోర్ట్ సేవ కేంద్రానికి హాజరు కావటం వల్ల ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.

2) ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?

భారత ప్రభుత్వం, 18 సంవత్సరాలు నిండిన తమ పౌరులకు తప్పనిసరిగా జారీ చేయవల్సిన ధృవీకరణ పత్రాల్లో ఓటర్ ఐడీ ఒకటి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటర్ ఐడీ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది లైసెన్స్ లాంటింది.

అంతేకాదు, అనేక లీగల్ డాక్యుమెంటేషన్లలో ఓటర్ ఐడీ కార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు ఓటు గుర్తింపు కార్డును పొందాలంటే కనీసం 6 నెలల సమయం పట్టేది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞాణం, ఓటర్ ఐడీ జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేసింది. ఓటు గుర్తింపు కార్డుకు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేయటం ద్వారా బోలెండత సమయం ఆదా అవటంతో పాటు ఇతర బెనిఫిట్లను కూడా పొందవచ్చు.

భారత ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం ఒక్కో పౌరుడు ఒక ఓటర్ ఐడీని మాత్రామే కలిగి ఉండాలి. ఓటర్ ఐడీ కార్డ్ కోసం ఆన్లైన్లో ధరకాస్తు చేసుకునే క్రమంలో సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకున్న ఓటర్ ఐడీ నేరుగా వ్యక్తి చిరునామాకే డెలివరీ చేయబడుతుంది. ఆన్లైన్ ప్రాసెస్లో ఓటర్ ఐడీకి ధరఖాస్తు చేసుకువటం ద్వారా కేవలం నెల రోజుల వ్యవధిలో ఓటు గుర్తింపు కార్డును పొందవచ్చు. ఆఫ్లైన్ ప్రాసెస్లో ఈ ప్రక్రియకు 8 నుంచి 9 నెలల సమయం పట్టొచ్చు. ఆన్లైన్లో ఓటు గుర్తింపు కార్డుకు ధరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది…

స్టెప్ – 1:

ముందుగా ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

http://www.nvsp.in/index.html

స్టెప్ – 2:

వెబ్సైట్ హోమ్ పేజీలో కనిపించే Apply online for Registration of new Voter అనే టాబ్ పై క్లిక్ చేయండి.

స్టెప్ – 3:

Form 6తో కూడిన ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మీ రాష్ట్రం, పార్లమెంటరీ నియోజికవర్గ పరిధి, పేరు, పుట్టిన తేదీ, జన్మ స్థలం వివరాలను పొందుపరచటంతో పాటు ఫోటో తదితర సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవల్సి ఉంటుంది.

Form 6ను పూర్తిగా ఫిల్ చేసిన తరువాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని submit బటన్ పై ప్రెస్ చేయండి.

మీ అప్లికేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయినట్లయితే, అప్లికేషన్లో మీరు వెల్లడించిన ఈ-మెయిల్ ఐడీకి, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నుంచి ఓ లింక్ అందుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే మీ పర్సనల్ ఓటర్ ఐడీ పేజీకి రీడైరక్ట్ అవుతారు.

మీ మెయిల్ కు వచ్చిన లింక్ ద్వారా మీ ఓటర్ ఐడీ సంబంధించిన స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

3) ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

కొత్తగా ఆధార్ కార్డ్ కోసం ‘Apply’ చేసుకున్నారా..?, మీకో గుడ్ న్యూస్!. సాధారణంగా ఆధార్ కార్డుకు ధరఖాస్తు చేసుకున్న వారికి, వారి ఆధార్ కార్డ్ పోస్ట్ ద్వారా పంపబడుతుంది.

కొంత మందికి పోస్ట్లో రావటం ఆలస్యమవుతుంది. ఇలాంటి సందర్బాల్లో ఆధార్ కార్డ్ను నేరుగా ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంటర్నెట్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో ఆధార్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకునేందుకు పలు సలువైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది…

ఇంటర్నెట్ ద్వారా ఆధార్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకునేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు.. మీ ఆధార్కు సంబంధించిన Enrollment ID.ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీకిచ్చిన Acknowldgement form పై ఈ ఐడీ ఉంటుంది. అలానే మీ పేరు, యారియా పిన్ కోడ్, ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీరిచ్చిన మొబైల్ నెంబర్.

ముందుగా ఆధార్కు సంబంధించిన అధికారిక వైబ్సైట్ UIDAIలోకి లాగిన్ అవ్వండి. వెబ్సైట్ లింక్  https://eaadhaar.uidai.gov.in/

లింక్ ఓపెన్ అయిన తరువాత మీకు స్కీన్ పై బాగంలో Aadhaar No (UID), Enrollment No (EID) పేర్లతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Enrollment No (EID)ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి.

కనిపించే ఆప్షన్లలో ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీకిచ్చిన Acknowledgement form పై ఉన్న విధంగా Enrollment Number , Resident Name(ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ) , Area Pin Code, Capcha text ఇంకా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి.

వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని Get One Time Password పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్ మెసేజ్ రూపంలో అందుతుంది.

ఆ OTPని క్రింది సెక్షన్లో ఎంటర్ చేసి Validate&Download పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది అయిపోతుంది.

PDF ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు password అడుగుతుంది, Area Pin Code ఎంటర్ చేస్తే చాలు. మీ ఆధార్ డౌన్లోడ్ అవుతుంది.

ముందుగా https://resident.uidai.net.in/find-uid-eid లింక్లోకి వెళ్లండి.

స్కీన్ పై బాగంలో Aadhaar No (UID), Enrollment No (EID) పేర్లతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Aadhaar No (UID) ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి.

తరువాతి స్టెప్లో భాగంగా ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు కోసం మీరు ధరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి.

తరువాతి స్టెప్లో భాగంగా ఆధార్ కార్డు కోసం మీరిచ్చిన మెయిల్ లేదా ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయండి.

ఆ తరువాత క్రింది బాక్సులో కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఏలా ఉందో అలానే ఎంటర్ చేయండి.

Get OTP ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ మెయిల్ లేదా మొబైల్ నెంబర్ కు OTP అందుతుంది.

మీ మొబైల్ లేదా మెయిల్ కు అందిన OTPని Enter OTP* అనే బాక్సులో టైప్ చేసి verify OTP పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ మీ మొబైల్కు పంపబడుతుంది.

4.ఆధార్ కార్డు మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

ఆదార్ కార్డు వివరాలు

ఆదార్ కార్డు వివరాలు

ఇప్పుడు మీరు ఆధార్ కార్డు మార్పులు చేర్పులు చేయవచ్చు. మీరు ఇంతకుముందు ఇచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మీరు ఆధార్ సెంటర్లకు తిరగనవసరం లేదు. కేవలం మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు. నెట్ సదుపాయం ఉంటే మనమే ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి మన వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటం ఎలా..?

స్టెప్ 1

వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. అక్కడ మీకు సెండ్ ఓటీపీ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.

ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం.

diviseema-2

స్టెప్ 2

ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్ … వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది.

diviseema3

స్టెప్ 3:

చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది.

diviseema-4

స్టెప్ 4:

కొత్త వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయా .. లేదా అనే దానిని పరిశీలించేందుకు సైట్ కు వెళ్లాలి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు.

diviseema-5

స్టెప్ 5:

ఇందుకోసంసైట్ ఓపెన్ చేయాలి. ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి.


400x400_MIMAGEdc1dbc52da20abcc21d8092487cb42d0స్టెప్ 6:

పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది.

diviseema-6

స్టెప్ 7:

ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది.

diviseema-7

స్టెప్ 8:

కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

స్టెప్ 9:

ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు.

స్టెప్ 10:

చిరునామా 1: యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ నెం 10, చింద్వారా, మధ్య ప్రదేశ్ – 480001, భారతదేశం.చిరునామా 2: యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ No.99, బంజారా హిల్స్, హైదరాబాద్ – 500034, భారతదేశం.

స్టెప్ 11:

కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి.