9502036628

దివి కాల్ సెంటర్

Avanigadda

Krishna District,Andhrapradesh,India

10:00 AM - 6:00 PM

Monday to Saturday

శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి వారి దేవస్థానం – పెదకళ్ళేపల్లి

నాగేశ్వర ఆలయం;

విశాలమైన ప్రాంగణంలో చారిత్రకసంపదతో ఆధ్యాత్మిక వాతావరణంలో అశేష భక్తజనావళి విశేషంగా ఆకర్షిస్తున్న దివ్య దైవ ప్రభా విలసితం నాగేశ్వరస్వామి ఆలయం. గంభీరమైన రాజగోపురం ముందు చల్లపల్లి రాజావారి శాసనం ఉంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణ మార్గమునందు సత్యస్థంభం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది పాలరాతి స్థంభం.  బౌద్ధ చిహ్నితములతో అస్పష్టంగా కనిపించే బ్రాహ్మీశాసన లిపితో ఉన్న స్థంభం చారిత్రకంగా ప్రాముఖ్యమైనది.  అయితే ఈ బ్రాహ్మిశాసనం చదివే వీలులేక పోవడం ఎంతో విలువైన సమాచారం మనకు అందకుండా పోయింది. వాదవివాదాలు ఏర్పడినప్పుడు ఈ స్థంభం దగ్గర సత్యప్రమాణం చేయడానికి వస్తారు. ఆసత్యవాడదికి దైవశిక్ష పడుతుంది.  అందువల్ల ఆ స్తంభానికి సత్యస్తంభమనే పేరు వచ్చింది. కర్కోటక నాగ ప్రతిమ ఇక్కడే ఉన్నది. కాబట్టి కర్క్కోటక స్తంభామనే మరోక పేరు కూడా ఉంది. ఆలయ గోడలపై ఆలయాన్ని ప్రథమంగా పునర్నిర్మించిన  సోమశివాచార్యుల వారి ప్రతిమ మనకు కనిపిస్తుంది. ప్రక్కనే పంచముఖ గణపతి విగ్రహం కూడా కనిపిస్తుంది. వాయువ్య దిశలో  సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, ఉత్తదిశగా దక్షణాభిముఖంగా కాలభైరవ ఆలయం ఉంది. ఈశాన్య దిశలో 16 స్తంభాల కళ్యాణమండపం  ఉంది. ఇక్కడ స్తంభాల మీద శాసనాలు చెక్కి ఉన్నాయి.

          రంగమండప నిర్మాణంలో బౌద్ద చిహ్నిత స్తంభాలు కొన్ని కనిపిస్తున్నాయి. ముఖమండపం, ప్రవేశ ద్వారపాలకులతో ద్వారస్తంభం పైన గజలక్ష్మి అమ్మవారితో ఉన్నది. ఈ మండపం మధ్య నాలుగు స్తంభాలు, మధ్యలో నంది. ముఖమండపంలో శాసనాలతో పాటు మహా తపస్వీ, మంత్రవేత్త ఉమ్మన్న గారి రూపు ఒక స్థంభం మీద చెక్కబడింది.

          మరోక స్తంభం మీద మరోక యంత్రం, ఇంకొక స్థంభం, మరోక యంత్రం, చెక్కబడింది. వీటి విశ్లేషణ పూర్తి కానందువలన వివరాలు అందించలేకపోతున్నాను.

          అంతరాలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, పైన దక్షిణం వైపు గణపతి ఉన్నారు. గర్భాలయ ప్రవేశద్వారంపై దత్తాత్రేయుని విగ్రహo ఉంది. పైన ఉత్తరదిశగా చిన్న బొమ్మ ఉంది. రూపు తెలియడం లేదు.

          గర్భాలయంలో పరమ కారుణ్యమూర్తి, సమస్త దోష నివారకుడు, సకలిస్వర్య ప్రదాయకుడు శ్రీ నాగేశ్వరస్వామి  ఉన్నాడు. దివ్య ప్రకాశంతో, అజ్ఞానతమస్సులను పారద్రోలి జ్ఞానజ్యోతులను హృదయక్షేత్రాలతో వెలిగిస్తాడు. పదేపదే స్వామిని దర్శించవలెనన్న భక్త్యావేశం భక్తులకు కల్గుతుంది. భక్తసులభుడు –సర్వశక్తి ప్రదాయకుడు అయిన నాగేశ్వరస్వామి వారిని నమశ్శతములు భక్తులు సమర్పిస్తుంటారు. మొక్కుబడులు చెల్లిస్తుంటారు. పునర్ధర్శనం కోరుకుంటారు.

Open chat
Chat With Us
Welcome to our site www.diviseema.info, if you need help simply reply to this message, we are online and ready to help.
Powered by