9502036628

దివి కాల్ సెంటర్

Avanigadda

Krishna District,Andhrapradesh,India

10:00 AM - 6:00 PM

Monday to Saturday

నాంచారమ్మ అమ్మవారి దేవస్థానం మరియు శివాలయం -విశ్వనాథపల్లి

ప్రాచీన కధ;

ఒకప్పుడు ఈ ప్రాంతం నుండి పశువులను మేపుకుంటూ కాపు కుటుంబీకులు కొందరు అద్దంకి పరిసర ప్రాంతాలలో ఉండగా, ఉన్నట్టుండి పశువులు నీలగి పడిపోవసాగాయి. అద్దంకి నాంచారమ్మ ఒకరి ఒంటి మీదకు వచ్చి, తనను కోలుచుకోవలసిందిగా, ఆవిధంగా చేస్తే, పశువులను కాపాడుతానని పలికింది. కొండవీటి లేక కొండేటి ఇంటి పేరు గల కాపు కులస్థుల కుటుంబీకులు అమ్మవారి మాటను తలదాల్చి శిలారుపం దాల్చిన అమ్మవారిని భక్తి పూర్వకంగా తీసుకువచి విశ్వనాధపల్లిలో ప్రతిష్టించారని ఒక కథనం. కాగ ఈ కుటుంబీకులు అద్దంకి అమ్మవారిని దర్శించి తిరిగి వస్తుండగా కృష్ణా నదిలో అద్దంకి నాంచారమ్మ విగ్రహం  లభించిందని ఆ అమ్మవారిని సభక్తికంగా  తీసుకువచ్చి ప్రతిష్టించారని మరోక కథ. ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని రాములు, లేదా రామినీడు అనే భక్తుడు చేసాడని ఒక ఐతిహ్యం. ఇతను కూడా కాపుకులస్తుడే! మొదటిగా ఊరిచివరలో అమ్మవారిని ప్రతిష్టించారు. రెండు అడుగుల ఎత్తు కల శక్తిస్వరుపిణి అద్దoకి నాంచారమ్మ అప్పటి నుంచి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంది. అమ్మవారు ఇక్కడకు వచ్చిన తరువాత చాలా గ్రామాలలో ప్రజలు అద్దంకి నాంచారమ్మ పేరుతో అమ్మవారిని గ్రామదేవతగా నిలుపుకున్నారు. అయితే విశ్వనాధపల్లిలో ఉండే నాంచారమ్మకు ఒక విశేషం ఏమిటంటే ఆవిడే  ఇక్కడ కులదేవత. తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఏ విధంగా స్వయంభవుగా  వున్నాడో ఆవిధంగానే అద్దంకి నాంచారమ్మకూడా స్వయంభువు. తరువాత మనం ఏ విధంగా వెంకటేశ్వరస్వామీ వారి ఆలయాలు కట్టుకుంటున్నామో  ఆవిధంగానే నాంచారమ్మ ఆలయాలు కూడా దివిసీమలో వెలిసాయి. నాంచారమ్మ పశువులను కాపాడే దేవతగా బాగా ప్రఖ్యాతిని పొందింది. అందువలన రైతులందరూ తమ పశువులను గుడిచుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. దీనివల్ల అవి ఎటువంటి రోగాలకు, దోషాలకు, అన్తుకాకుండా ఉంటాయని వారి నమ్మికా. ఇది నిజం కూడా.

          అమ్మవారి ఆలయం  కాలక్షేపం  మండపం, ముఖమండపం, గర్భగుడి అనే మూడు విభాగాలతో ఈనాడు మనకు కనిపిస్తుంది. 1990 సంవత్సరంలో వచ్చిన గాలివానకు ధ్వజస్తంభానికున్న మేఖలాలు ఉడిపోయి రేకు లేచిపోయి  స్తంభపు చెక్కంతా చీకిపోయి ఉన్నప్పుడు ఆ చెక్క ధ్వజస్తంభాన్ని తీసివేసి 1002-1999  సంవత్సరంలో శాస్త్రోక్తంగా నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఆలయం మొట్ట మొదట తాటాకులతో ఉండేదట. తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందసాగింది. నూతన ఆలయ శంఖుస్థాపన లో జరగగా, 10-03-1987వ సంవత్సరంలో పునః ఆలయ నిర్మాణం, నాంచారమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది. దిగువగా ఉన్న ఆలయాన్ని నవీకరించి ఎత్తు బాగా పెంచి నేడు వేలాది భక్తలు సులభంగా దర్శనం పొందే విధంగా నిర్మించారు, కాగా ముఖమందపాన్ని 19-03-2000 నాడు చక్కగా నిర్మించారు.

Open chat
Chat With Us
Welcome to our site www.diviseema.info, if you need help simply reply to this message, we are online and ready to help.
Powered by