మన నియోజకవర్గంలో జరుగబోవు కార్యక్రమాల సమాచారం:

  • ఇంటి దగ్గరినుండే మన నియోజకవర్గం లో ఉన్న ఏ గ్రామం నుండి ఏ దూర ప్రాంతానికి అయిన కార్ బుక్ చేసుకునే సదుపాయం అవనిగడ్డ నియోజకవర్గం ఆండ్రాయిడ్ అప్ లో పొందుపరచడం జరిగింది.ఈ సర్వీస్ ద్వార అతి తక్కువ ధరలలో కార్ బుక్ చేసుకునే సదుపాయము అందుబాటులోకి వచ్చింది.
  • సంక్రాంతి పండుగ నేపధ్యంలో , ఈ నెల జనవరి 13 న మన అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలంలో  జరుగపబోవు సాంప్రదాయ పడవల పోటిలకు ముస్తాబు అవుతున్న నాగాయలంక . ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం వచ్చి వీక్షించేదుకు అవకాశాలు ఉన్నాయు .
  • ఇక ముందు మన నియోజకవర్గంలో అన్ని మండలాలలో జరుగబోయే ప్రత్యేక కార్యక్రమాలు ,ఈవెంట్స్ సమాచారాన్ని “అవనిగడ్డ నియోజకవర్గం ఆండ్రాయిడ్ అప్ ” లో  పొందు పర్చనున్నట్లు దివిసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీధర్ బాబు గారు తెలియజేయడం జరిగింది.తద్వారా నియోజకవర్గంలోని ప్రజలందరికి ఆయా కార్యక్రమాలు గురుంచి తెలుసుకునటకు మరియు పాల్గొనుటకు ఉపయోగపడుతుంది అని అన్నారు.
  • దివిసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో –అవనిగడ్డ నియోజక వర్గంలోని ఆరు మండలాలలోని  వ్యాపారస్థులకు -త్వరలో డిజిటల్ లావాదేవిల ఫై ఈ నెల చివరలోపు అవనిగడ్డ లో అవగాహన సదస్సు ఉంటుందిని .త్వరలో సదస్సు జరుగు ఫంక్షన్ హాల్ వివరాలను తెలియజేయ న్నున్నట్లు తెలియజేయడం జరిగింది. 
  • దివిసీమ పరిరక్షణ సమితి అధ్వర్యంలో మన నియోజకవర్గంలోని ,BTECH ,MCA, MTech, MSC మరియు వివధ రంగాలలో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవిద్యార్ధులకు ఉపయోగపడేవిధంగా “ఉద్యోగ-సమాచారం” అనీ what’sapp గ్రూప్ ని  ప్రారంభించడం జరిగింది ,ఈ గ్రూప్ ద్వార అతి త్వరగా ఉద్యోగ వివరాలను ఎప్పటికప్పుడు మన నియోజకవర్గంలోని విదార్ధులకు తెలియజేసి వారికీ ఉద్యోగం వచ్చేలా  కృషి చెయ్యడం జరుగుతుందని .అలాగే ఎంతో మంది IT, HR రిక్రూటర్స్ని కూడ ఆహ్వనించడం ద్వార ఈ గ్రూప్ లో ఎప్పటికప్పుడు ఉద్యోగ వివరాలు పోస్ట్ చెయ్యడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది.