7680977457

Customer Care

Avanigadda

Krishna District,Andhrapradesh,India

10:00 AM - 6:00 PM

Monday to Saturday

గౌతమ బుద్ధ స్థూపం -ఘంటసాల

గౌతమబుద్ధ స్థూపం
గౌతమబుద్ధ స్థూపం -ఘంటసాల

చరిత్ర:

ఆంధ్రప్రదేశంలో ప్రసిద్దమైన ప్రాచీన బౌద్దక్షేత్రాలలో ఘంటసాల ఒకటి. ఇది బౌద్దక్షేత్రమే కాకుండా, ప్రఖ్యాతి పొందిన రేవు పట్టణం కూడా! దీని కీర్తి దేశవిదేశాలలో విఖ్యాతము. ఇక్కడ దొరికిన బౌద్ద స్థూప శిధిలావశేషాలు, వివిధ కాలాలనాటి నాణాలు, గృహోపకరణాలు,శిల్పాలు, తదితర అంశాల వల్ల దివిసీమలో ఘంటసాల – దివిసీమ చరిత్రను పరిపుష్టము చేయడమే గాక! ప్రాశస్త్యాన్ని కూడా కలగచేసింది. ఘంటసాల వ్యాపార కేంద్రము కావడం వలన వ్యపారులు, నావికులు, ఓడలకు సంబందించిన కార్మికవర్గం, ఉద్యోగులు, తదితర వర్గాలవారందరూ ఘంటసాలలో నివశించేవారు. వివిధ వర్గాలకు సంబంధించిన పురాతన వస్తువులు ఈ అంశాన్ని బలపరుస్తున్నాయి. ఇక్కడ సముద్ర వ్యాపారానికి మూలం కృష్ణాముఖ ద్వారం. నాటి క్రుష్ణాముఖ ద్వార పట్టణమైన  – ఘంటశాల లోని సమస్త ప్రజలు జలదీస్వరుడిని ఆరాధించేవారు. జలధి అంటే సముద్రం గదా! ఎన్ని మతాలు – ఎన్ని సిద్దంతాలు వస్తున్నా ప్రాకృతిక శక్తుల ఆరాధనలో పెద్దగా మార్పులుండవు. బౌద్దమతం ప్రచారంలో ఉన్నా! గ్రీకు దేశ భౌగోళిక శాస్త్రవేత్తల అయిన టాలమి(క్రీ.శ.140) భారతదేశంలో రేవులను పపేర్కొంటూ, కృష్ణానదీ ముఖద్వారంలోని కొంటకొశ్శిల, కొద్దురు రేవులను ప్రస్తావిస్తాడు. పరిశోధకులు అనేకవిధాలుగా చర్చించి కొంతకోశ్శిల ఘంటసాలగా నిర్ధారించారు.

          ఇక ఇక్కడ దొరికిన మన నాణాల మీద రెండుతెర చాపలు గల ఓడ చిహ్నం, ముందు అర్ధచంద్రాకృతి కలిగిన   తెరచాపతో ఉన్న ఓడ చిహ్నము, విభిన్నమైన తెరచాపలతో కూడుకున్న ఓడ చిహ్నముల వల్ల మన నౌకా వ్యాపారము  అభివృద్ధి ఎంత ఉన్నతంగా ప్రశాక్తికేక్కినదో తెలుస్తుంది. ఆనాడు ఘంటసాల లో విదేశీ వర్తకులు కూడా నివశించేవారు. ఆనాడు ఘంటసాల ఒక విధంగా మెట్రోపాలిటిన్ సిటీ అన్నమాట! విదేశాలతో క్రయవిక్రయాలు  జరిపే రేవు పేరుకు చివర పట్టణం అనే పదం వస్తుంది కాబట్టి – ఘంటసాల పట్టాన స్థాయికలదని  మనం అనుకోవచ్చును.

          ఘంటసాల పేరు మీద చాలా చర్చ జరిగింది.శాసనాలలో ఉన్న కంటకసేల – ఘంటసాల అయిందని పరిశోధకుల అభిప్రాయం. శాసనాలలో కటకశాల, కంటశాలి, గంటశాల అనే పేర్లు వస్తున్నాయి. గ్రామానికి అనుబంధంగా ఉండే ఘోటకము లేదా గోటకము యొక్క ఈ ప్రాంతీయ చరిత్ర వేరు. చోల పాండ్యపురమని,గజరాజ పట్టనమనే పేర్లు కూడా ఉన్నాయి.

 

Ghantasala Archaeological Museum

ఘంటసాలలో చూడ దగ్గ ప్రదేశాలలో మ్యుజియం ఒకటి ఇక్కడ, బుద్దినీ విగ్రహాలు, బుద్ధుని పాద ప్రతిమలు, శిల శాసనాలు మొదలగునవి మనము చూడవచ్చు.

 

Ghantasala statues

 

నోట్ : బౌద్ద మ్యూజియం వారిని సంప్రదించుటకు ఫోన్ నెంబర్: 9700506049,జలదీశ్వరస్వామీ  టెంపుల్ ఆపోజిట్ రోడ్,ఘంటసాల.

Open chat
Chat With Us
Welcome to our site www.diviseema.info, if you need help simply reply to this message, we are online and ready to help.