Activities & Goals

దివిసీమ పరిరక్షణ సమితి  విధులు :

  • ఒక నియోజక వర్గం ఆదర్శ నియోజక వర్గంగా ఉండాలంటే , ప్రతి గ్రామం లో మంచి రోడ్డు మార్గాలు, ద్ర్యనేయజ్ వ్యవస్థ , మంచి నీరు సదుపాయం ,విద్యా, ఉపాధి సదుపాయాలు ఉండాలి అలగే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలి అలాంటి ఉద్దేశ్యం తోనే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోనీ  మన నియోజక వర్గాన్ని ఒక మోడల్ నియోజక వర్గంగా  మార్చడానికి మేము దివిసీమ పరిరక్షణ సమితి ప్రారంభించడం జరిగింది. దీనిలో బాగంగా ప్రజలకు ఉపయోగపడే ప్రతి అంశం మీద మేము కృషి చెయ్యడం జరుగుతుంది.
  • నియోజక వర్గంలో ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, మరియు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమి తీసుకున్న ప్రజలు తరుపున ,ప్రజల రక్షణఖై మేము వాటిని  పూర్తిగా నిరోధించడానికి మేము కృషి చెయ్యడం జరుగుతుంది. ప్రజా జీవనానికి కీడు తలబెట్టి వ్యక్తులుని ఎవరి నైన మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.
  • దివిసీమ పరిరక్షణ సమితి వెబ్సైటు లో పొందుపరిచే ప్రతి గ్రామ సమస్య మీద మేము ద్రుష్టి పెట్టి , సమస్య నిర్మోలన దిశగా మేము గవర్నమెంట్ వారిమీద వత్తిడి తీసుకుని రావడం జరుగుతుంది తద్వారా సమస్యను నిర్మోలించే విధంగా కృషి చెయ్యడం జరుగుతుంది . అలగే సమస్యను సబ్మిట్ చేసిన వెంటనీ నిముషాల వ్యవధిలో మన కృష్ణా జిల్లా కలెక్టర్ కి మెయిల్ వెళ్ళే విధంగా టెక్నాలజీ రుపొంధించం జరిగింది.
  • నియోజక వర్గంలోని ప్రతి విద్యార్ధికి ఉపయోగ పడే విధంగా మేము గత సంవత్సరం 2014 నవంబర్ 15 నుండి మేము ఎడ్యుకేషన్ గైడెన్స్ సెల్  స్థాపించడం జరిగింది .దీనిలో బాగంగా ఎవరైనా  ఎడ్యుకేషన్ గైడెన్స్ కోసం మా దివిసీమ పరిరక్షణ సమితి ఫోన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలు నమోదు చేసుకున్నవారికి  ప్రతి శని మరియు ఆది వారాలలో ఆయా రంగాలలో రాణిస్తున్న నిపుణులే స్వయంగా కాల్ చేసి సరియన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
  • నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా ఉద్యోగ సమాచారం ఎప్పటి కప్పుడు దివిసీమ పరిరక్షణ సమితి వెబ్సైటు ద్వారా అందించడం జరుగుతుంది తద్వారా నిరుద్యోగ నిర్మోలనకి కృషి చెయ్యడం జరుగుతుంది.
  • మగ, ఆడ నిష్పత్తి లో మన నియోజక వర్గంమే, మన రాష్ట్రములో చాలా అట్టడుగున ఉందనే చెప్పు కోవాలి . ప్రతి వెయ్యి  మంది బాలురకు గాను ఆడ వారి సంఖ్య 770 గా ఉంది. అందువలన  బ్రూన హత్యలను నిషేదించే విధమగా  ప్రతి గ్రామం లోకి సేవ్ ది గర్ల్ చైల్డ్  నినాదాన్ని తీసుకుని వెళ్లి , ప్రతి ఒక్కరిలో ఆడ మగా ఇద్దరు సమానమనే తెలియజేసి , అలగే గవర్నమెంట్ తరుపు నుంచి అందుబాటులో ఉన్న బాలకలకి ఉపయోగపడే పదకాలని వారికీ తెలియజేసి  బాలికల సంఖ్య పెంపొందించడానికి మేము కృషి చెయ్యడం జరుగుతుంది.