దివిసీమ , డెల్టాప్రాంతంలో కృష్ణాజిల్లాలో ఉన్న ఒక చిన్న అందమైన దీవి .మహారాష్ట్రము లో ని మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణానది ఆంధ్రప్రదేశ్ లో పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి సాగరసంగమం వద్ద సముద్రం లో కలుస్తుంది . ఈ రెండు పాయలు మధ్య ఏర్పడిన భూమిని దివిసీమగా పిలుస్తారు . భౌగోళికంగా ఈ ప్రాంతం చాలా మంచి సారవంతమైన పవిత్ర భూమి. భక్తి భావానికి పుట్టినిల్లుగా విరాసిల్లుతుంది. ఎన్నో పవిత్ర దేవాలయాలను తనవడిలో ఉంచుకున్న పవిత్రభూమి మన దివిసీమ.
దివిసీమ లో ప్రతీ గ్రామం లోను ఏదో ఒక మహాక్షేత్రం నెలకొని ఉంది. అవన్నీ ప్రాఛీనమైనవే ,వేటికవి ప్రాముక్యత సంతరించుకున్నవే. ఇన్ని మహాక్షేత్రాలు ఒకే ప్రాంతం లో నెలకొని ఉండటం , ఆంధ్రప్రదేశ్ లోనే అపూర్వం.
ఎంతో మంది ప్రముఖులకు, కళాకారులకు, మేధావులకు,దేశభక్తులకు, మహాత్ములకు జన్మనిచ్చిన పవిత్ర సీమ, మన దివిసీమ. ఒకటి మాత్రం సత్యం ఈ సీమ ఒక అన్నపూర్ణ , ఆధ్యాత్మిక క్షేత్రం , ఎందరో మహానుభావుల జన్మస్తలం .
ఈ దివిసీమ లో పుట్టి , ఎంతో పేరు , ప్రఖ్యాతలు , సంపాదిచ్చిన కోందరు ప్రముఖుల మరియు గొప్ప నాయకుల సమాచారం మీకోసం.
1 . మండలి వెంకటకృష్ణారావు(కాంగ్రెస్) .
2. సింహాద్రి సత్యనారాయణరావు(టి . డి . పి).
3.అంబటి బ్రాహ్మణయ్య (టి . డి . పి)
4.సనక బుచ్చి కోటయ్య (communist leader and First M.P. of Machilipatanam)
5.ఘంటసాల వెంకటేశ్వరరావు ( సంగీతం).
6 .పింగళి వెంకయ్య ( జాతీయ జెండ స్ప్రుస్టికర్త)
7. మండలి బుద్ధప్రసాద్ (టి . డి . పి )
8. కంఠంనేని రవిశంకర్
9. తోట శ్యాంకిషోర్ నాయుడు
10. పురమా శ్రీధర్ బాబు (దివిసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు)
11. వేటూరి సుందరరామమూర్తి
చలనచిత్ర రంగం: అవనిగడ్డ నియోజకవర్గం నుండి చలనచిత్ర రంగంలో ఉన్న ప్రముఖులు.
1.సోమవరపు రఘుబాబు(గేయ రచయత)
2.వరికూటి వరప్రసాద్ ( ఫిల్మ్ డైరెక్టర్)
3. కే. విజయ భాస్కర్ (ఫిల్మ్ డైరెక్టర్ )